ధర్మపురిలో నృసింహుని దక్షిణ దిగ్యాత్ర

ABN , First Publish Date - 2020-03-12T10:30:48+05:30 IST

ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనృసింహస్వామి దక్షిణ దిగ్యాత్రను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దక్షిణంవైపు స్వామివారు విహారయాత్రకు బయలుదేరే కార్యక్రమాన్ని

ధర్మపురిలో నృసింహుని దక్షిణ దిగ్యాత్ర

ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనృసింహస్వామి దక్షిణ దిగ్యాత్రను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దక్షిణంవైపు స్వామివారు విహారయాత్రకు బయలుదేరే కార్యక్రమాన్ని దక్షిణ దిగ్యాత్రగా చెబుతుంటారు. ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి మంగళవాయిద్యాలతో దక్షిణ దిశలో గల పోలీ్‌సస్టేషన్‌ వైపు తీసుకెళ్లారు. పోలీసుల కుటుంబ సభ్యులు, మహిళలతో కలిసి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఏఎస్పీ దక్షిణామూర్తి, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, ధర్మపురి సీఐ లక్ష్మీబాబు పోలీస్‌ సిబ్బంది స్వామి వారల సేవలను ఎత్తుకున్నారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో   ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

  - ధర్మపురి 

Updated Date - 2020-03-12T10:30:48+05:30 IST