క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2020-12-28T04:48:32+05:30 IST

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

 చిలుపూర్‌, డిసెంబరు 27 : క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగుపడడంతో పాటు మానసికోల్లాసం పొందవచ్చని  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్‌ అన్నారు. ఆదివారం మం డలంలోని వంగాలపల్లి క్రికెట్‌ క్రీడా మైదానంలో జరుగుతున్న 24 జిల్లాల 20 -20 క్రికెట్‌ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన 20- 20 మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌తో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన జట్లు తలపడ్డాయి. విజేతగా నిలిచిన వరంగల్‌ జట్టుకు షీల్డ్‌ను అందజేశారు.  కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ ఆలీముద్దీన్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-28T04:48:32+05:30 IST