పేదలకు స్పోర్ట్స్ అధారిటీ సభ్యుల అండ
ABN , First Publish Date - 2020-04-07T21:07:57+05:30 IST
లాక్ డౌన్ కారణంగా ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు

హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు స్పోర్ట్స్ అధారిటీ సభ్యులు అండగా నిలిచారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించడమే ప్రజలు దేశానికి చేసే అతిపెద్ద సాయమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస వచ్చి జీవిస్తున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి ఇంకా రెండు నెలలు ఉన్నా.. తెలంగాణలో తిండికి, కూరగాయలకు ఇబ్బందిలేదని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ షాపులకు వచ్చే లబ్దిదారులు కూడా సామాజిక దూరం పాటించాలని శ్రీనివాస్ గౌడ్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.