కరోనాపై చెస్ట్ ఆస్పత్రిలో స్పెషల్ వార్డు: మహబూబ్ ఖాన్

ABN , First Publish Date - 2020-03-04T22:06:30+05:30 IST

నగరంలోని ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ ఆస్పత్రిలో 50 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెస్ట్ హాస్పిటల్ సూపరిండెంట్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ఈ వార్డును వీలైనంత త్వరగా ఏర్పాటు పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు

కరోనాపై చెస్ట్ ఆస్పత్రిలో స్పెషల్ వార్డు: మహబూబ్ ఖాన్

హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ ఆస్పత్రిలో 50 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెస్ట్ హాస్పిటల్ సూపరిండెంట్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ఈ వార్డును వీలైనంత త్వరగా  ఏర్పాటు పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు. కరోనా గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాదతీ, చెస్ట్‌ ఆస్పత్రిలో కరోనా అనుమానితులు ఎవరూ చేరలేదని స్పష్టం చేశారు. ఇక్కడి రోగులను వేరేచోటుకు తరలిస్తామనేది నిజం కాదని, స్వైన్ ఫ్లూ కేసులను ప్రత్యేక వార్డులో ట్రీట్ చేస్తున్నామని మహబూబ్ ఖాన్ తెలిపారు.

Updated Date - 2020-03-04T22:06:30+05:30 IST