నేటి నుంచే ప్రత్యేక పారిశుధ్య ప్రణాళిక
ABN , First Publish Date - 2020-06-01T09:00:13+05:30 IST
నేటి నుంచే ప్రత్యేక పారిశుధ్య ప్రణాళిక
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకుగాను ప్రభుత్వం రూపొందించిన ‘ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ ప్రణాళిక’ కార్యక్రమం సోమవారం నుంచి ఈ నెల 8 వరకు జరగనుంది. రాష్ట్రంలోని 141 మునిసిపాలిటీలు, 12,751 గ్రామ పంచాయతీల్లో దీన్ని నిర్వహించేందుకు మునిసిపల్, పంచాయతీరాజ్ సంస్థల యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా దోమల నివారణకు చర్యలు తీసుకోవడం, మురుగు కాలువల్లో పూడికతీత, ఫాగింగ్ వంటివి చేపడతారు.