అమెరికన్ల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం

ABN , First Publish Date - 2020-04-08T01:49:31+05:30 IST

అమెరికన్ల కోసం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానం తరలివెళ్లింది. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో మొత్తం 99 మంది అమెరికన్లను ..

అమెరికన్ల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం

హైదరాబాద్: అమెరికన్ల కోసం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానం తరలివెళ్లింది. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో మొత్తం 99 మంది అమెరికన్లను తరలించారు. లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్ నుంచి 3 ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్‌ను వినియోగిస్తున్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు కార్గో సేవలు కొనసాగుతున్నాయి.


కాగా కరోనా నేపథ్యంలో భారత్‌‌తో పాటు పలుదేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. అక్కడి వాళ్లు కూడా ఇక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు అమెరికాలాంటి దేశాల్లో చిక్కుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే అమెరికన్లు కూడా తెలంగాణలో ఉండిపోయారు. దీంతో రెండు దేశాల పరస్పర సహకారంతో ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అమెరికన్లను ప్రత్యేక విమానంలో అమెరికాకు తరలించారు. 

Read more