‘కరోనా’కు ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలి: రేవంత్
ABN , First Publish Date - 2020-03-27T09:54:22+05:30 IST
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు వెంటనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు వెంటనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గురువారం ట్వీట్ చేశారు.