అత్యవసర సిబ్బంది కోసం ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2020-03-27T17:05:23+05:30 IST
వరంగల్: అత్యవసర సిబ్బంది తరలింపు కోసం వరంగల్ ఎంజీఎంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
వరంగల్: అత్యవసర సిబ్బంది తరలింపు కోసం వరంగల్ ఎంజీఎంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హసన్ పర్తి, మడికొండ, ఆరెపల్లి, నాయుడుపంపు, గొర్రెకుంట ప్రాంతాల నుంచి ఎంజీఎం వరకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ఐడీ కార్డులు చూపించి అత్యవసర సిబ్బంది ఈ బస్సులలో ప్రయాణించాలని కోరింది. ఉదయం 7: 30కు, మధ్యాహ్నం 1:30కు, సాయంత్రం 7:30కు ఈ బస్సులు తిరగనున్నాయి.