‘ఫాలున్ గాంగ్’ చైనా ఊచకోతకు నిరసనగా ప్రత్యేక కార్యక్రమం
ABN , First Publish Date - 2020-12-10T23:09:57+05:30 IST
చైనా ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని పాశవికపు సంఘటన.. ఫాలున్ దఫా. చైనా కేంద్రంగా 1999లో జరిగిన అత్యతం దారుణ ఊచకోత నిదర్శనమే ఈ ఫాలున్ దఫా. ఫాలున్ గాంగ్ విధానాలను అనుసరించే వారిని ప్రభుత్వమే బహిరంగంగా అత్యంత దారుణంగా హతమార్చిన...

హైదరాబాద్: చైనా ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని పాశవికపు సంఘటన ఫాలున్ దఫా సభ్యులపై 1999లో జరిగిన అత్యంత దారుణ ఊచకోత. ఫాలున్ గాంగ్ విధానాలను అనుసరించే వారిని ప్రభుత్వమే బహిరంగంగా అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన అది. ఫాలున్ గాంగ్ అనే ఈ శాంతియుత జీవన విధానాన్ని అవలంబించడాన్ని వ్యతిరేకించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఆ విధానాన్ని పాటించే వారిని అణచివేసింది. అందరూ చూస్తుండగా వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చైనా పాలకులు చేసిన ఆ దారుణ ఘటనను గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ ఫాలున్ దఫా నిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మణ్యం. ఆ పాశవికపు ఘటనకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఈస్ట్-మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పాంప్లేట్లు పంచి పెట్టారు.
ఈ సందర్భంగా సుబ్రమ్మణ్యం మాట్లాడుతూ, ఇప్పటికీ చైనాలో ఫాలున్ గాంగ్ సభ్యులపై జరుగుతున్న దాడులు జరుగుతూనే ఉన్నాయని, అంతర్జాతీయంగా దీనిపై ప్రజలంతా గొంతు విప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాను ఫాలున్ గాంగ్ గురించి వివరించినప్పుడు, ప్రజలతో పాటు డాక్టర్లు కూడా షాక్‌కు గురయ్యారని తెలిపారు. ఇదిలా ఉంటే ఫాలున్ గాంగ్ జీవిత విధానాన్ని అవలంబిస్తున్న వారు ప్రజలకు దానిపై అవగాహన పెంచారు. పాలున్ గాంగ్ జీవిత విధానం ఎంతో ప్రశాంతమైందని, విశ్వ నియమాలకు, స్వచ్ఛతకు, దాతృత్వానికి, ఓర్పుకు నిదర్శనమని వివరించారు.
చైనాలో ప్రతీరోజూ 160మంది ఖైదీలను అవయవాల కోసం హతమారుస్తుంటారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడా లేని రీతిలో చైనాలో అవయవ మార్పిడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏటా లక్ష వరకు అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో చైనా అవయవ మార్పిడికి సంబంధించిన దేశంలా మారిపోయింది. మరోవైపు జపాన్‌లోని ఆరోగ్య బీమా సంస్థలు విదేశాల్లో నిర్వహించే శస్త్రచికిత్సలకు బీమాను వర్తింప చేస్తుండటంతో చైనాకు వస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఇజ్రాయెల్ నుంచి కూడా అవయవాలకోసం ఇక్కడికి తరలి వచ్చేవారు. అయితే 'ఫాలున్ గాంగ్' ఉదంతం బయటకు వచ్చిన నేపధ్యంలో ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి బీమా వర్తింపజేయకుండా ప్రత్యేక చట్టం చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రజలు చైనా రావడం మానేశారు. జపాన్‌లో కూడా ఇటువంటి చట్టాలు రానున్నట్లు తెలుస్తోంది.