ఉద్యోగుల కోసం ప్రత్యేక యాప్
ABN , First Publish Date - 2020-12-30T08:29:36+05:30 IST
ఉద్యోగులు తమ జీత, భత్యాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది

హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు తమ జీత, భత్యాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎ్‌ఫఎంఐఎస్) పేరిట ఇది ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన వారు తమ జీత, భత్యాలు, కోతలు వంటి వివరాలను పరిశీలించుకోవచ్చు. ఉద్యోగి బ్యాంకు ఖాతా నంబరు లేదా ఎంప్లాయి ఐడీ ద్వారా లాగిన్ కావచ్చు.