శాసనసభ భవనంలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం
ABN , First Publish Date - 2020-09-17T01:06:49+05:30 IST
తెలంగాణ శాసన సభ భవనంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.

హైదరాబాద్: తెలంగాణ శాసన సభ భవనంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి అనువుగా రూపొందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్‌రావు, పువ్వాడ అజయ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, గంగులకమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.