మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ ఆకస్మిక పర్యటన
ABN , First Publish Date - 2020-03-16T10:13:36+05:30 IST
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ప్రారంభమైనట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీ్‌సగఢ్ నుంచి జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న
గిరిజన ప్రజలతో మాట్లాడిన శశిధర్ రాజు
పెంబి, మార్చి 15: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ప్రారంభమైనట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీ్‌సగఢ్ నుంచి జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. ఆదివారం నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు పెంబి మండలంలోని మారుమూల గిరిజన మావోయిస్టుల ప్రభావిత గ్రామాలలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు. గిరిజన ప్రాంత గ్రామాల ప్రజలతో కలిసి వారి మంచీచెడ్డలు తెలుసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలను పెట్టుకోవద్దని సూచించారు. పిల్లలను పనులకు పంపకుండా చదివించాలని తల్లిదండ్రులను కోరారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారు లొంగిపోయేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.