కరోనా నియంత్రణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలి: ఎస్పీ రంగనాథ్

ABN , First Publish Date - 2020-03-30T19:40:14+05:30 IST

నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఎస్పీ రంగనాథ్ పిలుపునిచ్చారు.

కరోనా నియంత్రణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలి: ఎస్పీ రంగనాథ్

నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఎస్పీ రంగనాథ్ పిలుపునిచ్చారు. పోలీస్ శాఖకు మూడు లక్షల విలువైన శానిటైజర్లను టీఆర్ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అందజేశారు. 


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడడం లక్ధ్యంగా పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం శానిటైజర్ల కొరత ఉన్నదని ఇలాంటి సమయంలో మానవతా హృదయంతో పోలీసులకు శానిటైజర్లు అందించడం అభినందనీయమన్నారు. అంతరాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దులలో పోలీసులు 24 గంటలపాటు విధులు నిర్వహిస్తూ ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని.. కాబట్టి ప్రజలు తమతో సహకరించి అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని కోరారు.


అనంతరం కర్నాటి విద్యాసాగర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమవంతు సహకారం అందించాలనే లక్ష్యంతోనే పోలీస్ శాఖకు సానిటైజర్లు అందచేసినట్లు తెలిపారు. 


నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా పోలీసుల కృషి అభినందనీయమన్నారు. 


Updated Date - 2020-03-30T19:40:14+05:30 IST