సంక్రాంతికి మరో 6 ప్రత్యేక రైళు:్ల దక్షిణ మధ్య రైల్వే
ABN , First Publish Date - 2020-12-30T07:17:33+05:30 IST
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వివిధ మార్గాల్లో మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు

హైదరాబాద్/సికింద్రాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వివిధ మార్గాల్లో మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ (రైల్ నంబర్: 07440) రైలు సికింద్రాబాద్ నుంచి జనవరి 10, 11, 14, 15వ తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నంబర్: 07441) రైలు నర్సాపూర్ నుంచి జనవరి 11, 12, 15, 16వ తేదీల్లో రాత్రి 8 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. కాచిగూడ-చిత్తూరు స్పెషల్ (రైల్ నంబర్: 02797) రైలు కాచిగూడ నుంచి జనవరి 8 నుంచి 12, అలాగే 16న రాత్రి 8.05 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు చిత్తూరు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో చిత్తూరు-కాచిగూడ స్పెషల్ (రైల్ నం: 02798) చిత్తూరు నుంచి జనవరి 9, 10, 11, 12, 13, 17వ తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.20గంటలకు కాచిగూడ చేరుతుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (రైల్ నంబర్: 07436) సికింద్రాబాద్ నుంచి జనవరి 8 నుంచి 19వరకు రాత్రి 8 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.40 గంటకు కాకినాడ టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 07437) రైలు కాకినాడ టౌన్ నుంచి జనవరి 9 నుంచి 20వరకు రాత్రి 10.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అంతేగాక, ఇప్పటికే ప్రారంభించిన 38 పండుగ ప్రత్యేక రైళ్ల గడువును పొడిగిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇంతకు ముందు ప్రకటించిన సమయాల్లోనే వీటి సేవలు కొనసాగుతాయని చెప్పింది.