ఎస్సీలపై ద్వేషం పెంచేలా జొన్నవిత్తుల పద్యం

ABN , First Publish Date - 2020-04-25T09:36:44+05:30 IST

ప్రముఖ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇటీవల తాను రాసిన తెలుగు పద్యాన్ని చదువుతున్నట్లు వీడియో విడుదల చేశారని..

ఎస్సీలపై ద్వేషం పెంచేలా జొన్నవిత్తుల పద్యం

ఆయనపై చర్యలు తీసుకోవాలి: మాల సంఘం


మంగళ్‌హాట్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇటీవల తాను రాసిన తెలుగు పద్యాన్ని చదువుతున్నట్లు వీడియో విడుదల చేశారని, షెడ్యూల్డ్‌ కులాలు, వర్గాలపై ద్వేషాన్ని ప్రేరేపించేలా ఆ పద్యం ఉందని మాల సంక్షేమ సంఘం ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్‌ శుక్రవారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పద్యం మళ్లీ అంటరానితనానికి జన్మనిచ్చేలా ఉందని రామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-25T09:36:44+05:30 IST