హైదరాబాదీ మహిళకు సోమాలియా భర్త వేధింపులు

ABN , First Publish Date - 2020-11-06T08:20:00+05:30 IST

సోమాలియా పౌరుడిని పెళ్లి చేసుకున్న రహీం ఉన్నీసా అనే హైదరాబాదీ మహిళకు భర్త నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. తన

హైదరాబాదీ మహిళకు సోమాలియా భర్త వేధింపులు

 పిల్లలతో సహా నన్ను భారత్‌కు తీసుకెళ్లండి: బాధితురాలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సోమాలియా పౌరుడిని పెళ్లి చేసుకున్న రహీం ఉన్నీసా అనే హైదరాబాదీ మహిళకు భర్త నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. తన భర్త రోజూ కొడుతున్నాడని, తనతో పాటు తన ఐదుగురు పిల్లలను సోమాలియా నుంచి భారత్‌కు తీసుకెళ్లాలని హైదరాబాద్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్తకు ఆమె వీడియోలో విజ్ఞప్తి చేశారు.


సోమాలియాకు చెందిన ఒమర్‌ దాహిర్‌ ఫరా అనే వ్యక్తిని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన రహీం ఉన్నీసా 2008 ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. 2017లో వారు సోమాలియాలో స్థిరపడ్డారు. పిల్లలతో పాటు తన కూతురిని వెంటనే భారత్‌కు తీసుకురావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు బాధితురాలి తల్లి విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-11-06T08:20:00+05:30 IST