ఉద్యోగం పేరుతో అరబ్‌ షేక్‌లకు అమ్మేశాడు

ABN , First Publish Date - 2020-12-11T09:16:50+05:30 IST

వేలల్లో జీతం.. దుబాయ్‌లోని షాపింగ్‌మాల్‌లో కొలువు.. అంటూ ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఐదుగురు మహిళలను అరబ్‌ షేక్‌లకు అమ్మేసిన

ఉద్యోగం పేరుతో అరబ్‌ షేక్‌లకు అమ్మేశాడు

 పాతబస్తీలో ట్రావెల్‌ ఏజెంట్‌ మోసం..

ఐదుగురు మహిళల అగచాట్లు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వేలల్లో జీతం.. దుబాయ్‌లోని షాపింగ్‌మాల్‌లో కొలువు.. అంటూ ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఐదుగురు మహిళలను అరబ్‌ షేక్‌లకు అమ్మేసిన ఉదంతమిది. అక్కడ బాధితులు ఎలాంటి జీతం లేకుండా.. రోజూ 15 గంటల పాటు అవిశ్రాంతంగా గొడ్డుచాకిరీ చేస్తూ.. చిత్రహింసలకు గురవుతున్నారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న వారి బంధువులు.. విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


రెండేసి లక్షలు వసూలు చేసి, వారిని దుబాయ్‌కి పంపిన ఏజెంట్‌ను నిలదీస్తే.. ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున చెల్లిస్తే వెనక్కి రప్పించే ఏర్పాటు చేస్తామన్నారని బాధితుల సంబంధీకులు వాపోయారు. ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ను ఆశ్రయించడంతో.. ఆయన చొరవ తీసుకుని, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. బాధితులను భారత్‌కు రప్పించాలని.. మిస్రీగంజ్‌కు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ షఫీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


Updated Date - 2020-12-11T09:16:50+05:30 IST