లక్నవరం సరస్సులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గల్లంతు

ABN , First Publish Date - 2020-12-26T07:54:32+05:30 IST

ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని బుస్సాపూర్‌ సమీపంలో ఉన్న లక్నవరం సరస్సులో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గల్లంతయ్యాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ఇండస్ట్రియల్‌ ప్రాంతానికి చెందిన 18 మంది

లక్నవరం సరస్సులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గల్లంతు

కొనసాగుతున్న గాలింపు చర్యలు


గోవిందరావుపేట, డిసెంబరు 25 : ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని బుస్సాపూర్‌ సమీపంలో ఉన్న లక్నవరం సరస్సులో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు గల్లంతయ్యాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ఇండస్ట్రియల్‌ ప్రాంతానికి చెందిన 18 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు శుక్రవారం లక్నవరం సందర్శనకు వచ్చారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఉల్లూరి సుధాకర్‌ (22) ఈత కొట్టేందుకు సరస్సులోకి దిగాడు. ఈతకొడుతున్న క్రమంలో సుధాకర్‌ నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రవీందర్‌ సిబ్బందితో సరస్సు వద్దకు చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-12-26T07:54:32+05:30 IST