ఎలక్ట్రిక్ కార్గో బైక్ ప్లాట్‌ఫామ్ టీబైక్ ఫ్లెక్స్‌ను ప్రారంభించిన స్మార్ట్రాన్ కార్గో
ABN , First Publish Date - 2020-12-30T23:52:35+05:30 IST
ఎలక్ట్రిక్ కార్గో బైక్ ప్లాట్‌ఫామ్ టీబైక్ ఫ్లెక్స్‌ను ప్రారంభించిన స్మార్ట్రాన్ కార్గో

హైదరాబాద్: ఈ–బైక్ మరియు కార్గో డెలివరీ ప్లాట్‌ఫామ్ టీబైక్ ఫ్లెక్స్, పూర్తి ఎలక్ట్రిక్ కార్గో బైక్ ప్లాట్‌ఫామ్ టీబైక్ ఫ్లెక్స్‌ను స్మార్ట్రాన్ కార్గో ఇండియా ఆవిష్కరించింది. టీబైక్ ఫ్లెక్స్ రవాణా మరియు రైడర్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు అందిస్తుంది. లాజిస్టిక్స్ పార్టనర్స్ యొక్క స్ధానిక ఐటీ వ్యవస్థలు, ఈ–కామర్స్ కంపెనీలు మరియు ఫుడ్ డెలివరీ ఆపరేటర్స్‌తో సులభంగా సమన్వయం చేసుకునేలా ఉండటంతో పాటుగా వాస్తవ సమయంలో బిజినెస్ ఇంటిలిజెన్స్‌ను సులభతరం చేస్తుంది.
టీబైక్ ఫ్లెక్స్ ఇప్పుడు స్థానిక మరియు హైపర్ లోకల్ డెలివరీ అవసరాలను తీర్చగలదని సంస్థ తెలిపింది. ఇది గణనీయంగా ఖర్చు తగ్గించడంతో పాటుగా సౌకర్యవంతంగా ఉంటుంది. టీబైక్ ఫ్లెక్స్ ఇప్పుడు మరింతగా కార్గో డెలివరీ స్టాఫ్‌కు అందుబాటులో ఉంటుంది. రైడర్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్ దీనికి అవసరం లేదు. టీబైక్ ఫ్లెక్స్ ధరలు రూ. 40 వేల నుంచి ఆరంభం అవుతాయని కంపెనీ పేర్కొంది.
నగర పరిధిలో 40 కిలోమీటర్ల బరువును అతి సులభంగా తీసుకువెళ్లగలిగే రీతిలో ఉండటంతో పాటుగా రద్దీ ట్రాఫిక్‌లో సైతం సులభంగా వాహనం నడిపేందుకు వీలుగా ఉంటాయని సంస్థ వెల్లడించింది. అతి తక్కువ పార్కింగ్ ఫుట్‌ప్రింట్ కలిగిన ఈ వాహనాలు సంప్రదాయ ఖరీదైన మోటార్‌బైక్స్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని తెలిపింది. ఈ వాహన కార్గో బాక్స్‌లను ఎలాంటి వస్తువులు అయినా తీసుకువెళ్లగలిగే రీతిలో డిజైన్ చేశారు. టీబైక్ ఫ్లెక్స్ వాహనాలు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 75–120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని సంస్థ పేర్కొంది.
