స్మార్ట్ పోలీస్ విధానం కోసం అన్ని చర్యలు : కిషన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-10-04T21:00:07+05:30 IST
దేశంలో హైదరాబాద్‌తో సహా అన్ని నగరాల్లో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్మార్ట్ పోలీస్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని
హైదరాబాద్: దేశంలో హైదరాబాద్‌తో సహా అన్ని నగరాల్లో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్మార్ట్ పోలీస్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మన దేశంలో ప్రపంచంలోనే తొలి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబుల్లో 41 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే భర్తీలు పూర్తిచేస్తామని ఆయన ప్రకటించారు. పారా మిలటరీలో ఉద్యోగాలు పొందేందుకు త్వరలో జాతీయ రక్షణ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.