రెండు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-09-25T07:46:26+05:30 IST

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని, శుక్రవారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది...

రెండు రోజులు తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని, శుక్రవారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.


నెమ్మదించిన కృష్ణమ్మ

కొద్ది రోజులుగా కృష్ణా నదికి పోటెత్తుతున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టులకు భారీగా నమోదైన ఇన్‌ఫ్లో మెల్లగా తగ్గుతోంది. 

Updated Date - 2020-09-25T07:46:26+05:30 IST