శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాష్‌పై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం
ABN , First Publish Date - 2020-09-13T04:25:56+05:30 IST
శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిషేధిత భూములను పట్టాలుగా మార్చాలని ఏసీబీకి చిక్కిన ..

మెదక్: శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిషేధిత భూములను పట్టాలుగా మార్చాలని ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ నగేష్ తనపై ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. నగేష్ చెప్పినట్టు చేస్తే తాను కూడా జైల్లో ఉండేవాడినని భానుప్రకాష్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సమక్షంలో తహసీల్దార్ ఈ వ్యాఖ్యలు చేశారు. తహసీల్దార్ భానుప్రకాష్ వ్యాఖ్యలపై స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భానుప్రకాష్ కూడా ఎన్నో అక్రమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నాడని టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు.