పర్యాటక శాఖలో సింగిల్‌ విండో అనుమతులు

ABN , First Publish Date - 2020-12-13T07:35:44+05:30 IST

పర్యాటక శాఖలోనూ సింగిల్‌ విండో అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ పేర్కొన్నారు. టీఎస్‌ ఐపాస్‌ విధానానికి తెలంగాణ

పర్యాటక శాఖలో సింగిల్‌ విండో అనుమతులు

 టీఎస్‌ ఐపా్‌సకు.. పర్యాటక సేవల అనుసంధానం: శ్రీనివా్‌సగౌడ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖలోనూ సింగిల్‌ విండో అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ పేర్కొన్నారు. టీఎస్‌ ఐపాస్‌ విధానానికి తెలంగాణ పర్యాటక సేవల అనుసంధానంపై టూరిజం ప్లాజా హోటల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇకనుంచి పర్యాటక శాఖలో అనుమతుల ప్రక్రియ మరింత సులభతరమవుతుందని చెప్పారు.


హోటళ్లు, ట్రావెల్‌ ఏజెన్సీ, ఈవెంట్‌ అనుమతులు, రెన్యువల్స్‌కు త్వరితగతిన అనుమతులు లభిస్తాయన్నారు. ఒక హోటల్‌ నిర్మించాలంటే 15 రకాల అనుమతులు తీసుకోవాలని, టీఎస్‌ ఐపాస్‌ను అనుసంధానం చేయడం ద్వారా అనుమతులన్నీ 30 రోజుల్లోనే వస్తాయని తెలిపారు. 


Updated Date - 2020-12-13T07:35:44+05:30 IST