ఒకేరోజు 158 కేసులు
ABN , First Publish Date - 2020-05-29T09:01:17+05:30 IST
రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడంలేదు. గురువారం సాయంత్రానికి కొత్తగా 158 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,256కు చేరింది. గురువారం నాటి కేసుల్లో 66 స్థానికంగా నమోదయ్యాయి. మిగిలిన కేసులన్నీ

- మరో నాలుగు మరణాలు
- కోరలు చాస్తున్న కరోనా
- 2,256 చేరిన మొత్తం కేసులు
- స్థానికంగా 66 కొవిడ్ పాజిటివ్
- అందులో 58 జీహెచ్‌ఎంసీలోనివే
- 9మంది కానిస్టేబుళ్లకు వైరస్
- పహాడీషరీఫ్‌లో మరో 8మందికి
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్: రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడంలేదు. గురువారం సాయంత్రానికి కొత్తగా 158 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,256కు చేరింది. గురువారం నాటి కేసుల్లో 66 స్థానికంగా నమోదయ్యాయి. మిగిలిన కేసులన్నీ ఇతర రాష్ట్రాలు, సౌదీ అరేబియా నుంచి వచ్చినవిగా గుర్తించారు. స్థానికంగా నమోదైన 66 కొత్త కేసుల్లో 58 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి కాగా.. రంగారెడ్డి జిల్లాలో 5, మేడ్చల్‌లో 2 కేసులు నమోదయ్యాయి. కరోనా ఫ్రీ జిల్లా అయిన సిద్దిపేటలో కూడా గురువారం ఒక కేసు నమోదయింది. ఇప్పటిదాకా కరోనా చికిత్స అనంతరం 1345 మంది డిశ్చార్జి కాగా... 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రుల్లో 844 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిసా, బిహార్ రాష్ట్రాల నుంచి వస్తున్నవారిలోనే కరోనా లక్షణాలు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటిదాకా కొవిడ్ కేసులు నమోదు కాని జిల్లాలుగా వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి ఉన్నాయి. 14 రోజులుగా కేసుల్లేని జిల్లాల జాబితాలో 20 జిల్లాలున్నాయి. స్థానికంగా 1908 కేసులు న మోదు కాగా, విదేశాల నుంచి, వలస వచ్చినవారి నుంచి 348 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 9మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది.హైదరాబాద్ పరిధిలో ఒకే పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా వచ్చింది. వీరే కాకుండా న్యూ పటేల్ నగర్‌లో నివాసముంటున్న కానిస్టేబుల్‌కు, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ చెన్నారెడ్డినగర్‌లో నివాసం ఉండే మరో కానిస్టేబుల్‌కు వైరస్ సోకింది. గోల్నాక శంకర్‌నగర్‌లో నివాసం ఉండే ఇంకో కానిస్టేబుల్‌కు, కాప్రా సర్కిల్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని కృష్ణానగర్‌లో నివాసముండే మరో కానిస్టేబుల్‌కు వైరస్ నిర్ధారణ అయింది. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌లో పనిచేసే రహ్మత్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్ కొవిడ్ బారిన పడ్డాడు. సికింద్రాబాద్‌లోని ఓ పోలిస్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌కు కూడా కరోనా వచ్చింది.
- గాంధీలో చికిత్స పొందుతున్న 62 ఏళ్ల వృద్ధుడు, ఖైరతాబాద్ బీజేఆర్‌నగర్‌కు చెం దిన వృద్ధురాలు గురువారం మృతి చెందా రు. ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తే 8 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది.
- పహడీషరీ్‌ఫలో మటన్ వ్యాపారం నిర్వహించే కుటుంబాలలో మరో ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయింది.
- న్యూబోయిగూడ ఐడీహెచ్ కాలనీ ఐదో నెంబర్ బ్లాక్‌లో నివసించే రిటైర్డ్ ఉద్యోగి (67), అతని కుమారుడు (24)కూడా కరోనా బారిన పడ్డారు.
- కాచిగూడ కుత్బీగూడకు చెందిన ఓ నర్స్ భర్త(45) ఇటీవల సెలూన్ షా్‌పకు వెళ్లి వ చ్చాడు. కొద్ది రోజుల తరువాత అస్వస్థత చెందడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు తురాబ్‌నగర్‌లో ఓ మహిళకు, అల్వాల్‌కు చెందిన బ్యాంకు క్యాషియర్‌కు పాజిటివ్ నిర్ధారణ అయింది.
- రాంనగర్ జెమిని కాలనీలో వస్త్ర వ్యాపారి(42)కి, బాగ్‌లింగంపల్లి ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో టైలర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.
- సూర్యాపేట జిల్లా కాసరబాద గ్రామానికి చెందిన 4 నెలల బాలుడికి కరోనా సోకింది. చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ క్రమంలో బాలుడి తల్లికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది.
- నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి గురువారం మృతి చెందాడు. 25న ఇంటి ముందు కాలుజారి కిందపడిపోవటంతో తలకు బలమైన గాయమైంది. కోమాలోకి వెళ్లడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో కరోనా ఉన్నట్టు తేలింది.
- పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు వారం క్రితం ముంబై నుంచి ఇంటికి వచ్చాడు. పరీక్షల్లో అతడికి కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయింది.
ఏపీలో మరో 128మందికి వైరస్
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 128మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అరుంది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 74మంది ఉన్నారు. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసులు 3,245కు పెరిగాయి.