సింగరేణిలో ఎన్నికలు జరపండి

ABN , First Publish Date - 2020-07-19T07:04:01+05:30 IST

సింగరేణిలో యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పలు యూనియన్ల నాయకులు శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం...

సింగరేణిలో ఎన్నికలు జరపండి

కేంద్ర మంత్రికి జాతీయ సంఘాల నేతల వినతి


మంచిర్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పలు యూనియన్ల నాయకులు శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ గుర్తింపు కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తున్నందున వెంటనే సింగరేణిలో యూనియన్‌ ఎన్నికలను నిర్వహించాలని, ఇందు కోసం కేంద్ర కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశించాలని ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్‌, హెచ్‌ఎంఎ్‌స ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, బీఎంఎస్‌ సింగరేణి విభాగం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య కిషన్‌రెడ్డిని కోరారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఇతర యూనియన్‌ నాయకులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. యూనియన్‌ ఎన్నికలను జరిపేంత వరకు అన్ని యూనియన్లకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్లుగా కొత్త గనులు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదని, అందు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను సింగరేణిలో పాటించడం లేదని,  క్వారంటైన్‌లో ఉన్న వారికి, వైరస్‌ సోకిన వారికి, కట్టడి ప్రాంతంలో ఉన్న కార్మికులకు నిబంధనల ప్రకారం పూర్తి వేతనాలివ్వాలని కోరారు.

Updated Date - 2020-07-19T07:04:01+05:30 IST