సింగరేణి 3 రోజుల సమ్మె సక్సెస్‌

ABN , First Publish Date - 2020-07-05T06:29:38+05:30 IST

బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ సింగరేణిలో చేపట్టిన 3 రోజుల సమ్మె శనివారం విజయవంతంగా ముగిసింది. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ,

సింగరేణి 3 రోజుల సమ్మె సక్సెస్‌

  • 80 శాతం నిలిచిన బొగ్గు ఉత్పత్తి 

మంచిర్యాల/భూపాలపల్లి/కొత్తగూడెం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ సింగరేణిలో చేపట్టిన 3 రోజుల సమ్మె శనివారం విజయవంతంగా ముగిసింది. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎ్‌స, బీఎంఎస్‌, సీఐటీయూ మరో 8 కార్మిక సంఘాలు, ఐఎ్‌ఫటీయూ, ఏఐఎ్‌ఫటీ యూ, టీఎన్‌టీయూసీ, సింగరేణి ఉద్యోగుల సంఘాలు సమ్మెకు మద్దతుగా నిలిచాయి. సింగరేణిలోని 45 బొగ్గు బావుల్లో, 28 డిపార్ట్‌మెంట్లలో శనివారం 77ు కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) మొదటి రోజు మాత్రమే సమ్మెలో పాల్గొంది. మిగిలిన 2 రోజులు సమ్మెలో పా ల్గొనకుండా ఆ సంఘానికి చెందిన కార్మిక నేతలు సిం గరేణి కార్మికులు విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కొందరు విధులు నిర్వహించినా ఉత్పత్తి లక్ష్యం మాత్రం నెరవేరలేదు.


మెజారిటీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి పరిధిలో 3రోజుల పాటు సుమారు 80% బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. శనివారం రామకృష్ణాపూర్‌, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, మందమర్రిలో ధర్నాలు, ప్రదర్శనలు కొనసాగాయి. కార్మిక నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.  భూపాలపల్లిలోని అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద కార్మిక సంఘాల నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పెట్టుబడిదారుల దిష్టిబొమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. సమ్మె వల్ల మూడు రోజుల్లో సింగరేణి రాబడిపై రూ.110 కోట్ల మేరకు దెబ్బపడినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో రూ.40 కోట్ల వరకు వేతనాలను కార్మికులు కోల్పోయారు. ఇక కోల్‌ ఇండియాలో సమ్మె విషయానికి వస్తే.. జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో 2.75 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో కేంద్రంపై ఒత్తిడి పడింది.


సమ్మె ఫలితంగా 41 బ్లాక్‌లకు వేసిన  వేలం బిడ్‌లను ఇంకా కేంద్ర ప్రభుత్వం తెరవనట్లు సమాచారం. కాగా కోల్‌ ఇండియా, సింగరేణిలో సమ్మె గ్రాండ్‌ సక్సెస్‌ అయినట్టు పది జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి.  సమ్మె కారణంగా బొగ్గు ఉత్పత్తితోపాటు సరఫరా నిలిచిపోయినట్టు వెల్లడించాయి. జాతి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను ఎదుర్కొనే విధంగా త్వరలోనే తమ సభ్యులు సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని పేర్కొన్నాయి. 

Updated Date - 2020-07-05T06:29:38+05:30 IST