సింగరేణి లాభాల ప్రకటన ఎప్పుడు?
ABN , First Publish Date - 2020-10-08T09:21:29+05:30 IST
సింగరేణి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నికర లాభాలను సంస్థ ఇంకా ప్రకటించకపోవడంతో తమకు వాటా ఎప్పుడు ఇస్తారోనని

కొత్తగూడెం, అక్టోబరు 7: సింగరేణి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నికర లాభాలను సంస్థ ఇంకా ప్రకటించకపోవడంతో తమకు వాటా ఎప్పుడు ఇస్తారోనని కార్మికులు ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా మార్చి, ఏప్రిల్‌లోనే ప్రకటించాల్సి ఉంది. ఈసారి అక్టోబరు వచ్చినా స్పందన లేదు. కరోనా లాక్‌డౌన్ వల్ల కొంత అంతరాయమేర్పడినా ఉత్పత్తిని కొనసాగించిన కార్మికులు ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని అధిగమించే దిశగా సాగుతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి రూ.939 కోట్లు నికర లాభాలుగా వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈసారి 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.