సూర్యాపేట మార్కెట్‌ యార్డులో షటిల్‌ ఆట

ABN , First Publish Date - 2020-09-03T10:01:46+05:30 IST

ఓ డాక్టర్‌, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆట స్థలంగా మార్చేశారు.

సూర్యాపేట మార్కెట్‌ యార్డులో షటిల్‌ ఆట

  • విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి 

సూర్యాపేటసిటీ, సెప్టెంబరు 2: ఓ డాక్టర్‌, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆట స్థలంగా మార్చేశారు. అంతేకాకుండా అక్కడ కొంత భాగంలో షటిల్‌ కోర్టు ఏర్పాటు చేసి, దాని చుట్టూ బతుకమ్మ చీరలు అడ్డుగా కట్టారు. కొద్ది కాలంగా  ప్రతిరోజూ ఉదయం వారు అక్కడ షటిల్‌ ఆడుతున్నారు. మార్కెట్‌ యార్డు సిబ్బంది, కార్యదర్శి బీవీ రాహుల్‌ అక్కడ షటిల్‌ ఆడకూడదని వారికి చెప్పారు.  అయితే వారు తలబిరుసుగా సమాధానం చెప్పారు. ‘‘ఇక్కడ ఆడుకోకూడదని జీవో కాపీ ఉందా?’’ అని నిలదీశారు. ఈ విషయం తెలిసి జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి స్పందించారు. ఆ సంఘటనపై, అక్కడికి బతుకమ్మ చీరలు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించారు. బతుకమ్మ చీరలు యార్డు స్తంభాలకు కట్టి షటిల్‌ ఆడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2020-09-03T10:01:46+05:30 IST