లాక్‌డౌన్‌లో పాటించాల్సిన నిబంధనలివే..

ABN , First Publish Date - 2020-03-23T14:43:11+05:30 IST

హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం వెల్లడించింది.

లాక్‌డౌన్‌లో పాటించాల్సిన నిబంధనలివే..

హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం వెల్లడించింది.


లాక్‌డౌన్ సమయంలో తీసుకోవాల్సిన నిబంధనలు:


అయిదుగురికి మించి గుంపులుగా తిరగకూడదు

ఎలాంటి ఫంక్షన్లు చేయకూడదు

ప్రయాణాలు, విహార యాత్రలు నిషేధం

విదేశాల నుంచి వచ్చినవారు బయటకు రాకూడదు

బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు బంద్

షాపింగ్ మాల్స్, ధియేటర్లు, జిమ్‌లు, ఫంక్షన్ హాళ్లు మూసివేత

వృద్ధులు, చిన్న పిల్లలను బయటకు పంపకూడదు

గుళ్లు, మసీదులు, చర్చిలు అన్నీ మూసివేత


లాక్‌డౌన్‌లో మినహాయింపులు:


తప్పనిసరి అయితేనే బయటకు రావాలి

అత్యవసరాల కోసం బయటకు రావొచ్చు

అత్యవసర సేవల ఉద్యోగులు బయటకు వెళ్లొచ్చు

బయటకు వచ్చినా రెండు మీటర్ల దూరం ఉండాలి

పరిశుభ్రత పాటించాలి

ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు

కొనసాగనున్న టెలికామ్‌, ఇంటర్‌నెట్‌, పోస్టల్‌ సేవలు


Updated Date - 2020-03-23T14:43:11+05:30 IST