టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న మంత్రి తమ్ముడు?

ABN , First Publish Date - 2020-12-15T14:26:48+05:30 IST

వరంగల్: టీఆర్ఎస్ నేతలకు ప్రస్తుతం బీజేపీ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. ఇప్పటి వరకూ ఆ పార్టీలో ఉన్న అసంతృప్తులంతా బీజేపీ వైపు చూస్తున్నారు.

టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న మంత్రి తమ్ముడు?

వరంగల్: టీఆర్ఎస్ నేతలకు ప్రస్తుతం బీజేపీ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. ఇప్పటి వరకూ ఆ పార్టీలో ఉన్న అసంతృప్తులంతా బీజేపీ వైపు చూస్తున్నారు. తాజాగా.. టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. పార్టీ మారడం వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తమ పార్టీలో పక్కకు పెట్టిన వారు పార్టీ మారడం సహజమేనని దీనిపై ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.


Updated Date - 2020-12-15T14:26:48+05:30 IST