‘సెట్’ల తేదీలు ఖరారు
ABN , First Publish Date - 2020-08-20T09:19:08+05:30 IST
వాయిదా పడ్డ అన్ని సెట్‌ల పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనికి సంబంధించి తేదీలను ఖరారుచేసింది.

హైదరాబాద్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వాయిదా పడ్డ అన్ని సెట్‌ల పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనికి సంబంధించి తేదీలను ఖరారుచేసింది. ఎంసెట్, ఈసెట్, పాలీసెట్ తేదీలను ఇప్పటికే ఖరారుచేయగా.. ఎంసెట్ మెడిసిన్‌తో పాటు ఇతర పరీక్షల తేదీలను కూడా బుధవారం ఖరారు చేశారు. ఎడ్‌సెట్‌ను అక్టోబరులో నిర్వహించనున్నారు. తేదీలను ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశం అవుతున్నారు. మంత్రి అంగీకారం అనంతరం వీటిని వెల్లడించనున్నారు. కాగా ఈసారి ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్ష ముందుగా నిర్వహించాలని నిర్ణయించగా.. మెడిసిన్ పరీక్షను వేరుగా రెండు రోజుల పాటు (నాలుగు విడతల్లో) నిర్వహించనున్నారు.