వలస కార్మికులను పంపించండి: నారాయణ

ABN , First Publish Date - 2020-04-12T09:06:15+05:30 IST

వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీపీఐజాతీయ కార్యదర్శి కె. నారాయణ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పేదలకు అందేలా చూడాలని,

వలస కార్మికులను పంపించండి: నారాయణ

  • పేదలకు పార్టీ కార్యర్తలు అండగా ఉండాలి: చాడ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీపీఐజాతీయ కార్యదర్శి కె. నారాయణ కోరారు.  ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పేదలకు అందేలా చూడాలని, శక్తి మేరకు నిత్యావసరాలు అందించాలని పార్టీ కార్యకర్తలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సూచించారు. వివిధ జిల్లాల పార్టీ కార్యదర్శులు, ప్రత్యేక ఆహ్వానితులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - 2020-04-12T09:06:15+05:30 IST