సారూ.. మా ఊరికి పంపండి

ABN , First Publish Date - 2020-04-14T09:07:08+05:30 IST

‘సారూ.. మమ్మల్ని మా ఊరికి పంపించండి’ అంటూ గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థ సైట్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఉంటున్న కూలీలుమంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే, రైళ్లు, బస్సులు బంద్‌ అయ్యాయని,

సారూ.. మా ఊరికి పంపండి

  • కేటీఆర్‌కు వలస కూలీల విజ్ఞప్తి
  • 15 రోజులు ఇక్కడే ఉండాలన్న మంత్రి 


రాయదుర్గం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘సారూ.. మమ్మల్ని మా ఊరికి పంపించండి’ అంటూ గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థ సైట్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఉంటున్న కూలీలుమంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే, రైళ్లు, బస్సులు బంద్‌ అయ్యాయని, మరో పదిహేను రోజులు ఇక్కడే ఉండాలని కేటీఆర్‌ చెప్పారు. వారికి అవసరమైన సదుపాయాలను నిర్మాణ సంస్థలు కల్పిస్తున్నాయా? అన్న విషయంపై క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థ సైట్‌లో ఒడిసా, బెంగాల్‌, బిహార్‌ రాష్ర్టాలకు చెందిన 400 మంది కూలీలు ఉన్న క్యాంపును సోమవారం కేటీఆర్‌ సందర్శించారు. లాక్‌డౌన్‌ను రెండు వారాలు పొడిగించిన దృష్ట్యా.. అందరూ నిబంధనలు పాటించాలని, ఎవరూ బయటకు రావద్దని, ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. కూలీల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్న వారిలో కేటీఆర్‌తో పాటు సీసీపీ దేవేందర్‌రెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - 2020-04-14T09:07:08+05:30 IST