కరోనా టీకాకు వైద్య సిబ్బంది వివరాలు పంపండి

ABN , First Publish Date - 2020-10-21T10:06:51+05:30 IST

రోనా టీకాను తొలి దశలో ఆరోగ్య రంగ సిబ్బందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో....

కరోనా టీకాకు వైద్య సిబ్బంది వివరాలు పంపండి

ప్రజలకు టీకా వేసేవారి వివరాలూ పంపాలన్న కేంద్రం


హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కరోనా టీకాను తొలి దశలో ఆరోగ్య రంగ సిబ్బందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. వివరాల సేకరణకు నోడల్‌ అధికారులుగా నియమితులైన వీరితో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని పారిశుఽధ్య కార్మికులు, రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సహా అందరి వివరాలను ఈ నెల 31లోగా పంపాలని ఆదేశించారు. ప్రజలకు టీకాలు ఇచ్చే వైద్య సిబ్బంది సమాచారం కూడా పంపాలని కూడా కేంద్రం కోరింది. 

Updated Date - 2020-10-21T10:06:51+05:30 IST