వైద్యుల వివరాలు పంపండి: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-12T09:28:20+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రాలలో వైద్యుల సంఖ్యను కేంద్రం సేకరిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న వైద్యుల వివరాలను పంపించాలని రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌

వైద్యుల వివరాలు పంపండి: కేంద్రం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రాలలో వైద్యుల సంఖ్యను కేంద్రం సేకరిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న వైద్యుల వివరాలను పంపించాలని రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) శనివారం కోరింది.  వైద్యుల పేర్లు, రిజిస్ట్రేషన్‌, ఫోన్‌ నంబర్లు, వారి స్పెషాలిటీ  వంటి వివరాలను పంపించాలని తెలిపింది. అందుకు అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సిద్ధం చేస్తోంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 12 వేల మంది వైద్యులే రిజిష్టర్‌ అయినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-12T09:28:20+05:30 IST