146 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

ABN , First Publish Date - 2020-03-25T21:28:06+05:30 IST

సూర్యాపేట: జిల్లా వ్యాప్తంగా విదేశాల నుంచి వచ్చిన 146 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

146 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

సూర్యాపేట: జిల్లా వ్యాప్తంగా విదేశాల నుంచి వచ్చిన 146 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. హోం క్వారంటైన్‌ను ఉల్లంఘిస్తే జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌లో పెడతామని హెచ్చరించారు. వారి పాస్‌పోర్ట్‌ను సైతం సీజ్ చేస్తామన్నారు. 


ప్రజలకు అందుబాటులో ఉండేలా వేర్వేరు ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిత్యావసర సరుకుల దుకాణాల ముందు డిస్టెన్స్ పాటించకున్నా, శానిటైజర్స్ పెట్టకున్నా దుకాణాలు మూసేస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. అత్యవసరమైతే 100కి ఫోన్ చేయాలని కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ్డి సూచించారు. 

Updated Date - 2020-03-25T21:28:06+05:30 IST