కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మండి: మల్లారెడ్డి

ABN , First Publish Date - 2020-04-14T09:52:30+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మండి: మల్లారెడ్డి

మేడ్చల్‌, ఏప్రిల్‌ 13: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. సోమవారం మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట, పూడూరు, మేడ్చల్‌ జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-04-14T09:52:30+05:30 IST