షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మస్థైర్యం: స్వాతిలక్రా

ABN , First Publish Date - 2020-12-15T08:33:11+05:30 IST

షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని మహిళా భద్రత విభాగం చీఫ్‌ స్వాతిలక్రా తెలిపారు. షీ టీమ్‌ పనితీరుపై ప్రముఖ సంస్థ

షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మస్థైర్యం: స్వాతిలక్రా

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని మహిళా భద్రత విభాగం చీఫ్‌ స్వాతిలక్రా తెలిపారు. షీ టీమ్‌ పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక సర్వే నిర్వహించగా.. ఫిర్యాదుదారుల్లో 94ు మంది షీ టీమ్స్‌ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌ అధికారులతో ఆమె తన కార్యాలయం నుంచి సోమవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షీ టీమ్స్‌ పనితీరుపట్ల ఫిర్యాదుదారుల్లో అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మహిళల్ని వేధింపులకు గురిచేస్తూ పట్టుబడ్డ వారికి నిరంతరం కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. బస్టాపులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించిన పోకిరీలకు ప్రముఖ మానసిక నిపుణులు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.


Read more