స్వీయ నియంత్రణ పాటించాలి: తలసాని
ABN , First Publish Date - 2020-04-12T09:02:26+05:30 IST
కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటి స్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ కోరారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి

- ‘సనత్‌నగర్’ నుంచి సీఎం సహాయనిధికి 7.55 కోట్ల సాయం
బేగంపేట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటి స్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ కోరారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రతి ఒక్కరూ సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, వ్యాపార అసోసియేషన్లు ఇప్పటి వరకు 7.55కోట్లు విరాళంగాఅందజేశారని తెలిపారు.