ఎవరూ రావొద్దని ఆ గ్రామం చుట్టూ తడికలు..
ABN , First Publish Date - 2020-03-24T14:57:29+05:30 IST
భద్రాద్రి: మణుగూరు మండలం విజయనగరం గ్రామం స్వీయ నిర్బంధంలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో..

భద్రాద్రి: మణుగూరు మండలం విజయనగరం గ్రామం స్వీయ నిర్బంధంలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ రావడానికి వీల్లేదంటూ గ్రామం చుట్టూ విజయనగరం వాసులు తడికలు ఏర్పాటు చేసుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ.. బయటి నుంచి ఎవరూ లోపలికి రావడానికి కానీ వీల్లేదని ప్రకటించారు.