‘సెల్ఫ్ చెక్ కియోస్క్’ ప్రారంభించిన మంత్రి ఈటల
ABN , First Publish Date - 2020-07-28T00:09:30+05:30 IST
ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు ‘వర్క్‌స్పేస్ మెటల్ సొల్యూషన్స్’ సంస్ధ సంక్షేమశాఖకు బహుకరించిన సెల్ప్‌చెక్ కియోస్క్ యంత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఈటల రాజేందర్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.

హైదరాబాద్: ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు ‘వర్క్‌స్పేస్ మెటల్ సొల్యూషన్స్’ సంస్ధ సంక్షేమశాఖకు బహుకరించిన సెల్ప్‌చెక్ కియోస్క్ యంత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఈటల రాజేందర్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మంత్రులకు ఈ యంత్రం పనితీరును వివరించారు. ఈ యంత్రం ముందు మనిషి నిలబడగానే సంబంధిత వ్యక్తి యొక్క ఫోటో, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ప్రాణవాయువు(ఆక్సీజన్)శాతాన్ని వెంటనే లెక్కగట్టి స్ర్కీన్ పై చూపిస్తుంది. చేతులు శుభ్ర పర్చుకోవడానికి శానిటైజర్ వస్తుంది. తర్వాత మన మొబైల్ ఫోను, తాళాలు, ఫైల్స్, ఆఫీస్‌బ్యాగ్ లాంటివి యువి బాక్స్‌లో ఉంచడం ద్వారా వాటన్నింటిని వైరస్ రహితంగా చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా అరనిమిషంలో పూర్తవుతుంది.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఈ యంత్రం పనితీరు అద్భుతమని అన్నారు.కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తెలంగాణలో కరోనా బారిన పడిన వారి రికవరీ రేటు ఎక్కువగా ఉందన్నారు. మరణాల రేటుజాతీయ సగటుకన్నా తక్కువగా ఉందన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దీనిని అన్నికార్యాలయాల్లో, బస్ స్టేషన్‌లు, రైల్వేస్టేషన్‌లలో, ఆసుపత్రుల వద్ద, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటుచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, టీఎన్జీవో అధ్యక్షులు కారం రవీందర్, ప్రఽధాన కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.