ప్రయాణికులతో సందడిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

ABN , First Publish Date - 2020-05-13T14:37:31+05:30 IST

ప్రయాణికులతో సందడిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

ప్రయాణికులతో సందడిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో సందడిగా మారింది.  బెంగళూర్ నుంచి రాజధాని ఢిల్లీకి వెళ్తున్న ప్రత్యేక రైలు ఈరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంది. రైల్వేస్టేషన్‌లో భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక లైన్స్‌ను ఏర్పాటు చేశారు. మాస్క్, శానిటీజర్స్‌తో ఉన్న ప్రయాణికులనే సిబ్బంది అనుమతిస్తున్నారు. అలాగే రైలు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి చేతికి అధికారులు స్టాంప్ వేస్తున్నారు.  దాదాపు 243 మంది ప్రయాణికులు బెంగళూర్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చారు. అలాగే సికింద్రాబాద్ నుంచి 288 మంది ప్రయాణికులు ఢిల్లీ వెళ్లనున్నారు. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. టికెట్ కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే లోపలికి అధికారులు అనుమతిచ్చారు. 

Read more