సచివాలయం సెక్షన్‌ ఆఫీసరూ!

ABN , First Publish Date - 2020-04-01T08:00:26+05:30 IST

ఢిల్లీ సమావేశానికి తెలంగాణ సచివాలయంలో పనిచేసే సెక్షన్‌ ఆఫీసర్‌ కూడా ఉన్నారని గుర్తించారు. ఆయన్ను మంగళవారం పోలీసులు సచివాలయంలోనే

సచివాలయం సెక్షన్‌ ఆఫీసరూ!

ఆ శాఖ సిబ్బంది అంతా క్వారంటైన్‌

ఢిల్లీ సమావేశానికి తెలంగాణ సచివాలయంలో పనిచేసే సెక్షన్‌ ఆఫీసర్‌ కూడా ఉన్నారని గుర్తించారు. ఆయన్ను మంగళవారం పోలీసులు సచివాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇరుకిరుకు గదుల్లో సచివాలయ పాలన ఉండటంతో కింది స్థాయి ఉద్యోగులను రొటేషన్‌ పద్ధతిలో విధులకు రమ్మని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 14న ఢిల్లీకి వెళ్లి మూడు రోజులపాటు సమావేశాల్లో పాల్గొని వచ్చి 18 నుంచి క్రమం తప్పకుండా సచివాలయ విధుల్లో పాల్గొంటున్నారు. రెండుసార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీకి కూడా వెళ్లి వచ్చారు. శాఖ కార్యదర్శి సమావేశాలకు కూడా హాజరయ్యారు. దాంతో సచివాలయాన్ని శానిటైజ్‌ చేసి, సదరు శాఖ సిబ్బందిని హోంక్వారంటైన్‌కు పంపారు. 

Updated Date - 2020-04-01T08:00:26+05:30 IST