శుభకార్యానికి వెళ్లొస్తుండగా స్కార్పియో కారులో మంటలు..
ABN , First Publish Date - 2020-12-15T11:42:20+05:30 IST
బంధువుల శుభకార్యానికి వెళ్లి ఇంటి

హైదరాబాద్ : బంధువుల శుభకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా స్కార్పియో కారులో మంటలు చెలరేగిన సంఘటన ఓల్డ్ బోయిన్‌పల్లి మల్లికార్జున కాలనీ రోడ్ నెం.3లో సోమవారం జరిగింది. మల్లికార్జున కాలనీకి చెందిన వసీం కుటుంబ సభ్యులు డైమండ్ పాయింట్‌లో ఓ శుభకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న స్కార్పియో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్నవారు వాహనాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. బోయిన్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.