త్వరలో స్కూళ్లు పున:ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-13T07:34:19+05:30 IST

కరోనా కారణంగా మూసివేసిన ప్రైవేట్‌ పాఠశాలల పున:ప్రారంభం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, అతి త్వరలోనే సానుకూల

త్వరలో స్కూళ్లు పున:ప్రారంభం

మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి,): కరోనా కారణంగా మూసివేసిన ప్రైవేట్‌ పాఠశాలల పున:ప్రారంభం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, అతి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం నిత్యావసరాలను ఆయన అందించారు.


కొవిడ్‌ కారణంగా ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెం దారు. అందుకే పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. స్కూళ్లను తెరిచే విషయంలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయన్నారు. 


Updated Date - 2020-12-13T07:34:19+05:30 IST