దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?
ABN , First Publish Date - 2020-12-29T03:51:39+05:30 IST
దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్‌రావు
మహబూబాబాద్ రూరల్/నెల్లికుదురు/దంతాలపల్లి/తొర్రూరు/మరిపెడ, డిసెంబరు 28 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ ఏమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్‌రావు ప్ర శ్నించారు. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయ గేటు ఎదుట సోమవారం ఆం దోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగం గా దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తామని చెప్పి నేటికి భూపంపిణీ చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి ప్రతా్‌పరెడ్డి, ఎల్థి మల్లయ్య, క్యాచువల్ శ్యాంసుందర్‌శర్మ, శశివర్థన్‌రెడ్డి, పసుపులేటి నవీన్‌నాయుడు, సి రికొండ సంపత్, చుక్కల నరేష్, రాం మ్మూర్తి, వీరేందర్, పల్లె సందీప్, బసవయ్య, రాజుగౌడ్, ఓర్సు పద్మావతి, రాధాపటేల్, రేష్మా పాల్గొన్నారు. నెల్లికుదురులో రాం చంద్రు, చంద్రమౌళిగౌడ్, శంకర్, బాబు, సురేందర్, వాసు, సోమయ్య డిప్యూటీ తహసీల్దార్ ఖాసీంకు వినతిపత్రం అందజేశారు. దంతాలపల్లి మండల కేంద్రంలో మహే్‌షగౌడ్, ధర్మారపు వెంకన్నలు తహసీల్దార్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. తొర్రూరు మునిసిపాలిటీ పరిధిలో యాక య్య, రవిబాబు, కుమార్, శ్రీమాన్, రాం మోహన్‌రెడ్డి, నవీన్‌లు తహసీల్దార్ రాఘవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మరిపెడ మునిసిపాలిటీ పరిధిలో గాదె రాంబాబు, భూక్య గోపికృష్ణ, శ్రీను, జనార్దన్, కాంతమ్మ, జగన్, గంగాధర్, సుధాకర్ తహసీల్దార్ రమే్‌షబాబుకు వినతిపత్రం అందజేశారు.