ఎస్సీ రుణాల వార్షిక ప్రణాళిక విడుదల

ABN , First Publish Date - 2020-12-20T04:36:54+05:30 IST

ఎస్సీ రుణాల వార్షిక ప్రణాళిక విడుదల

ఎస్సీ రుణాల వార్షిక ప్రణాళిక విడుదల

21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ : ఈడీ మాధవీలత

వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 19: జిల్లాలో నిరుద్యోగులైన ఎస్సీ యువతకు ఉపాధి రుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం 2020-21కు వార్షిక ప్రణాళిక విడుదల చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం, అర్హుల ఎంపిక విధానం, స్కీమ్‌లు, సబ్సిడీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు. సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలని, రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు సమర్పించాలని సూచించారు. గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రుణం పొందని లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌ నుంచి తొలగించినందున ప్రతీఒక్కరు 2020-21 సంవత్సరానికిగాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె సూచించారు. 


Read more