టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి

ABN , First Publish Date - 2020-09-25T08:54:17+05:30 IST

నల్లగొండజిల్లా మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ మణెమ్మ అనే ఓ మహిళ ఆరోపించారు...

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి

  • హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన ఓ న్యాయవాది భార్య 


అఫ్జల్‌గంజ్‌, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): నల్లగొండజిల్లా మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ మణెమ్మ అనే ఓ మహిళ ఆరోపించారు. కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ.. ఎమ్మెల్యే తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. న్యాయవాదైన తన భర్త బుచ్చిబాబు.. ఎమ్మెల్యే బాధితుల తరఫున కేసులు వాదిస్తున్నందుకు కక్షగట్టారని వాపోయారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్‌ రావు అక్రమాలకు అడ్డొచ్చిన తన భర్త, కొడుకు, ఇతర కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.


Updated Date - 2020-09-25T08:54:17+05:30 IST