ముంపు ప్రజలు ఆందోళన చెందొద్దు
ABN , First Publish Date - 2020-08-20T10:20:03+05:30 IST
గోదావరి నది ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళ న చెందొద్దని గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
వరద సహాయక చర్యలపై ఐటీడీఏలో అధికారులతో సమీక్ష
ఏటూరునాగారం రూరల్, ఆగస్టు 19: గోదావరి నది ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందొద్దని గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రభుత్వం పటిష్టంగా వరద సహాయక చర్యలు చేపడు తుందని తెలిపారు. ఏటూరునాగారం మండ లంలోని గోదావరి ముంపు ప్రాంతాలైన రామన్నగూడెం, ముల్లకట్టలో బుధవారం మంత్రి పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లోని పరిస్థితు లను పరిశీలించిన మంత్రి ఐటీడీఏ కార్యాలయంలో పీవో హనుమంత్ కె. జెండగే అధ్యక్షతన వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలోని గోదావరి నది, వాగులు, వంకల ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా సీఎం ముందుస్తు హెచ్చరికలతో జిల్లా యం త్రాంగం, ప్రజాప్రతినిధులు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. గోదావరి ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లోని 6,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి మెరుగైన సేవలందించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 150సెం.మీ వర్షపాతం నమోదైనప్పటికీ సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రామప్ప, లక్నవరం సరస్సులతో పాటు గ్రా మాల్లోని చెరువులకు వరద తాకిడి భారీగా ఉన్నందున దెబ్బతినకుండా ఇరిగేషన్ శాఖాధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గోదావరికి ఆనుకొని ఉన్న కరకట్ట విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి శాశ్వత పరిష్కార మార్గం చూపుతానని మంత్రి హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల్లో సీజనల్ వ్యాధులకు సం బంధించిన మూడు నెలల మందులను అం దుబాటులో ఉంచామన్నారు. అలాగే కరోనా వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.