కేవీ సత్యనారాయణ కన్నుమూత

ABN , First Publish Date - 2020-03-13T10:44:17+05:30 IST

రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన కేవీ సత్యనారాయణ(92) నల్లగొండ జిల్లా అనుములలో గురువారం మృతి చెందారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కేవీ స్వగృహానికి

కేవీ సత్యనారాయణ కన్నుమూత

హాలియా, మార్చి 12: రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన కేవీ సత్యనారాయణ(92) నల్లగొండ జిల్లా అనుములలో గురువారం మృతి చెందారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి  కేవీ స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కేవీకి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల తదితరులు  ఉన్నారు. సత్యనారాయణ 1929లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్‌కు వ్యక్తిగత సలహాదారుడిగా పనిచేశారు. 

Updated Date - 2020-03-13T10:44:17+05:30 IST